Monday, December 23, 2024

మీ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లండి

- Advertisement -
- Advertisement -

Indian Army told Pakistan to take Soldier's body

పాక్‌కు ఆర్మీ సమాచారం
నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో మృతి చెందిన పాక్ బాట్ జవాను

శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో శనివారం చోటు చేసుకున్న చొరబాటు యత్నం సందర్భంగా మృతి చెందిన మీ దేశ సైనికుడి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పాకిస్థాన్‌కు భారత ఆర్మీ తెలిపింది. శనివారం నియంత్రణ రేఖ వద్ద చోటు చేసుకున్న చొరబాటును భారత సైన్యం ముందే పసిగట్టి కాల్పులు జరిపింది. కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో పాక్ ఆర్మీ బోర్డర్ యాక్షన్ టీమ్( బ్యాట్)కు చెందిన సైనికుడు మృతి చెందినట్లు మేజర్ జనరల్ ఎఎస్ పెంధార్కర్ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తిని మహమ్మద్ షబీర్ మాలిక్‌గా గుర్తించామని తెలిపారు. పాక్ వైపున భారత చొరబాటు నిరోధక వ్యవస్థ ఉన్న చోట ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. భారత్‌లోకి చెరబడడానికి ప్రయత్నం జరిగిందనిపేర్కొన్నారు. అయితే భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అతనివద్ద ఎకె రైఫిల్, మందుగుండు సామగ్రి, 7 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కొనసాగిస్తోందని దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోందని పెంధార్కర్ చెప్పారు. అతనికి చెందిన వస్తువులను సోదా చేసినప్పుడు ఐడి కార్డు, పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లభించాయి. ఐడి కార్డుపై ఉన్న ఫొటోలో ఆ వ్యక్తి పాక్ ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News