Thursday, January 23, 2025

వృద్ధులకే టోకరా: అమెరికాలో భారతీయుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: వృద్ధులను ఆర్థికంగా మోసం చేసేందుకు అంతర్జాతీయ కుట్ర పన్నిన ఒక భారతీయుడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు 24 లక్షల డాలర్ల జరిమానాను అమెరికన్ కోర్టు విధించింది. నెవార్క్‌లోని జిల్లా జడ్జి కెవిన్ మెక్‌నల్టీ ఎకోర్టులో గత ఏడాది ఆగస్టులో ఆశిష్ బజాజ్ అనే భారతీయుడిపై అభియోగాలు నమోదయ్యాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 ఆగస్టు మధ్య కాలంలో ఆశిష్ బజాజ్, అతని సహచరులు కలసి వృద్ధులనే లక్షంగా చేసుకుని ఆర్థిక కుట్రకు పాల్పడ్డారని కోర్టులో రుజువైంది. వివిధ బ్యాకులు, ఆన్‌లైన్ రిటైలర్లు, ఆన్‌లైన్ పేమెంట్ కంపెనీలకు చెందిన ఆర్థిక నేరాల నిరోధక నిపుణులమని తమను తాము పరిచయం చేసుకున్న ఈ బృందం వృద్ధులను తమ మాయమాటలతో బురిడీ కొట్టించింది.

మీ బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ పేమెంట్ల కంపెనీలు, ఆన్‌లైన్ రిటైలర్లను మోసం చేయడానికి కొందరు స్కామ్‌స్టర్లు కుట్రపన్నారని, వారి మోసాలను అరికట్టేందుకు తాము రంగంలోకి దిగామని ఈ ముఠా సభ్యులు వృద్ధులకు ఫోన్‌లో తెలియచేశారు. ఈ ప్రయత్నాలకు మీ సహకారం కూడా కావాలంటూ వారికి మాయమాటలు చెప్పారు. మీ ఖాతాల నుంచి తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపిస్తే తాము కొద్దిరోజుల్లోనే వెనక్కు పంపివేస్తామని, ఈ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే స్కామ్‌స్టర్లను అరెస్టు చేస్తామని కూడా వారు వృద్ధులను నమ్మించారు. భారత్, చైనా, సింగపూర్, యుఎఇలోని వివిధ బ్యాంకులకు ఈ విధంగా డబ్బును బడిలీ చేయించారు. అమెరికాలోని తన బ్యాంకు ఖాతాకు కూడా బాధితుల చేత బజాబ్ డబ్బు బదిలీ చేయించుకున్నాడు. ఇలా 25 లక్షల డాలర్లకు పైగా బాధితుల నుంచి డబ్బును ఈ ముఠా కాజేసినట్లు ఆరోపణలు రుజువయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News