విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆందోళనకు గురైన ప్రవాస భారతీయులు స్టోర్లల్లో బియ్యం కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాలకు బాస్మతీయేతర తెల్లబియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. బార్ పాయిల్డ్ నాన్ బాస్మతి, బాస్మతి రైస్ ఎగుమతి విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన ఎన్నారైలు ముందస్తుగా కావాల్సినన్ని బియ్యం బ్యాగులు కొనేందుకు స్టోర్స్ వద్ద భారీ క్యూలు కట్టారు. అమెరికాలో రైస్ బ్యాగుల షార్టేజ్ కారణంగా ఒక ఫ్యామిలీకి ఒక బ్యాగ్ మాత్రమేనని బోర్డు ఏర్పాటు చేసిన స్టోర్స్ యాజమాన్యం.. 20 పౌండ్లు బరువు ఉండే రైస్ బ్యాగ్ ధర 18$ డాలర్లు నుండి 50$ డాలర్లకు పెంచాయి.
#India has banned the export of rice to foreign countries.
NRI rising for rice in concern
#RiceExportsBan #RiceExports pic.twitter.com/jRFqh6uiAK
— Siraj Noorani (@sirajnoorani) July 22, 2023