ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి నష్టాల్లో ముగిశాయి. తాజా విదేశీ నిధులు వెళ్లిపోయాయి. దానికి తోడు హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 141.87 పాయింట్లు లేక 0.24 శాతం క్షీణించి 59463.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 45.45 పాయింట్లు లేక 0.26 శాతం పడిపోయి 17465.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ప్యాక్‌లో మహీంద్ర అండ్ మహీంద్ర, టాటాస్టీల్, టాటా మోటార్స్, మారుతి, లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్‌టెల్ ప్రధానంగా నష్టపోయాయి. కాగా ఏషియన్‌పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రధానంగా లాభపడ్డాయి. ఇదిలావుండగా ఆసియా మార్కెట్లలో దక్షిణకొరియా, చైనా, హాంకాంగ్ స్టాక్ ఎక్స్‌ఛేంజీలు నష్టపోగా, జపాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజీ మాత్రం లాభాల్లో ముగిసింది.
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
- Advertisement -
- Advertisement -
- Advertisement -