Monday, November 25, 2024

క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో రెండో పతకానికి భారత యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఒక విజయం దూరంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పారిస్ గేమ్స్‌లో లవ్లీనా మహిళల 75 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 50 తేడాతో నార్వేకు చెందిన సునీవాను ఓడించింది. ఆగస్టు 4న జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనా బాక్సర్ లి కియాన్‌తో లవ్లీనా తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లవ్లీనాకు కాస్యం పతకం ఖాయమవుతోంది. ఇక సునీవాతో జరిగిన పోరులో లవ్లీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగింది. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా 69 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలిచింది. ఈ ఒలింపిక్స్‌లో కూడా లవ్లీనాకు పతకం సాధించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

దీపిక ముందంజ..
పారిస్: మహిళల వ్యక్తిగత ఆర్చరీ విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి ప్విక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఎస్తోనియా ఆర్చర్ రీనాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో దీపిక 65 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ప్రతికూల వాతావరణంలో విజయం కోసం ఇద్దరు తీవ్రంగా శ్రమించారు. ఇటు దీపిక అటు రీనా కూడా సర్వం ఒడ్డారు. దీంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తప్పలేదు. అయితే తీవ్ర ఒత్తిడిలోనూ దీపిక అద్భుత ఆటను కనబరిచింది. ప్రత్యర్థి సవాల్ దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది.

ఇదే క్రమంలో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక రౌండ్ 32 మ్యాచ్‌లో దీపిక అలవోక విజయం సాధించింది. క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)తో జరిగిన పోరులో దీపిక కుమారి 62తో సునాయాస విజయం అందుకుంది. కాగా, షూటింగ్‌లో భారత్‌కు నిరాశ మిగిలింది. బుధవారం జరిగిన మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్ పోటీల్లో భారత షూటర్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. రాజేశ్వరి కుమారి 22వ, శ్రేయ సింగ్ 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈక్వెస్ట్రియన్‌లో అనూష్ అగర్వాల్ కూడా నిరాశే మిగిల్చాడు. వ్యక్తిగత డ్రెసెజ్ గ్రౌండ్ ప్రీ విభాగంలో తొమ్మిదో స్థానంలో నిలిచి పోటీల నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News