Sunday, January 19, 2025

లండన్ మెట్రోలో భారతీయ పెళ్లికూతురు!(వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్రాచీన భారతీయ సంప్రదాయాల పట్ల, ఆధ్యాత్మిక విధానాల పట్ల పాశ్చాత్య దేశాలవారు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. మన పెళ్ళి వేడుకలంటే వారికి ఎంతో సరదా కూడా. విదేశాలకు చెందిన చాలామంది వధూవరులు ఇండియాకు వచ్చి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుంటారు.

అయితే విదేశాల్లో ఇలా పెళ్లిళ్లు జరిగిన దాఖలాలు తక్కువే. తాజాగా ఓ భారతీయ సంతతికి చెందిన అమ్మాయి పెళ్లి దుస్తుల్లో లండన్ మెట్రో ఎక్కింది. ఆమెను చూసిన మిగతా ప్రయాణీకులంతా నోళ్లు వెళ్లబెట్టారు. ఇంకొందరు ఆమెను తమ కెమెరాల్లో బంధించారు. ఎర్రటి లెహంగాలో మెరిసిపోతున్న ఆమె ఒక స్పానిష్-ఇండియా మోడల్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా, 27 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News