Monday, December 23, 2024

దుబాయ్‌లో భారతీయ బంగారం వ్యాపారి దాతృత్వం..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: యుఎఇలోని జైళ్లలో మగ్గుతున్న 900 మంది ఖైదీల విడుదల కోసం దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త, దాత ఒకరు ఈ ఏడాది ప్రారంభం నుంచి 10 లక్షల దినారాలు(సుమారు రూ.2.5 కోట్లు) విరాళంగా అందచేశారు. ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని అయిన 66 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్ 900 మంది ఖైదీల విడుదల కోసం 10 లక్షల దినారాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులకు విరాళంగా అందచేశారు. పవిత్ర రంజాన్ మాసం రానున్న నేపథ్యంలో మానవత్వానికి, క్షమాగుణానికి, దాతృత్వానికి ఇది సందేశమని ఫిరోజ్ మర్చెంట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అజ్మన్‌లోని 495 మంది ఖైదీలు, ఫుజైరాలోని 170 మంది, దుబాయ్‌లోని 121 మంది, అల్ ఖువెయిన్‌లోని 69, రస్ అల్ ఖైమాలోని 28 మంది ఖైదీల విడుదల కోసం ఫిరోజ్ మర్చెంట్ ఆర్థిక సహాయాన్ని అందచేశారని మాగల్ఫ్ పోర్టల్ వెల్లడించింది.

విడుదలైన ఖైదీల అప్పులను కూడా తీర్చిన మర్చెంట్ వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు విమాన ప్రయాణ చార్జీలను కూడా అందచేశారు. వారు తమ కుటుంబాలను తిరిగి కలుసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందచేశారని న్యూస్ పోర్టల్ తెలిపింది. గల్ఫ్‌లో నివసిస్తున్న తెలుగువారి కోసం మాగల్ఫ్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ పనిచేస్తోంది. 2024లో 3,000 మందికిపైగా ఖైదీలను విడుదల చేయించాలని మర్చెంట్ లక్షంగా పెట్టుకున్నారు. విస్మరించిన సమాజం పేరిట మర్చెంట్ తీసుకుంటున్న చొరవ వల్ల ఇప్పటివరకు 20 వేల మందికి పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News