ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పడు వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లీ దూరం కానున్నారు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనలో జరుగునున్న టెస్టు, వన్డే సిరీస్ లల్లో రోహిత్ శర్మ, కోహ్లీలు కలిసి ఆడే అవకాశం లేనట్లే కనబడుతోంది. రోహిత్ ముంబైలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో సిరీస్ కు దారం కాగా.. కోహ్లీ మాత్రం తన కూతురి మొదటి పుట్టిన రోజు ఉండడంతో వన్డే సిరీస్ ఆడలేనని బిసిసిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఇది కెపెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికంగా జరగనుందో తెలియదు కానీ..వన్డే కెప్టెన్సీ కోల్పోవడంపై కోహ్లీ కొంత అసంతృప్తిగా ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
indian Captains wont play together in SA Tour