Friday, December 27, 2024

కేన్స్‌లో తారల మెరుపులు

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారతీయ తారలు తళుక్కున మెరిశారు. డిజైనర్ దుస్తుల్లో స్టార్లు సందడి చేశారు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో వివిధ దేశాల స్టార్లతో పాటు ఇండియన్ స్టార్లు దీపికా పదుకునే, తమన్నా, ఊర్వశి రౌతెలా, కమల్ హాసన్, మాధవన్, ఏ.ఆర్.రెహమాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శేఖర్ కపూర్‌లతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లు ఆకట్టుకున్నారు. దీపికా పదుకునే డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరలో రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరిసింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా తెల్ల గౌనులో మురిపించగా… మిల్కీ బ్యూటీ తమన్నా డిజైనర్ డ్రెస్‌లో మైమరపించింది. ఇక విశ్వ నటుడు కమల్‌హాసన్ ‘విక్రమ్’ కోట్‌లో స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. ఇక అందాల తారలు ఐశ్వర్యా రాయ్, ప్రియాంక చోప్రా, పూజా హెగ్డేలు కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు.

https://twitter.com/officer_acc/status/1527123586313379840?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1527123586313379840%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fofficer_acc2Fstatus2F1527123586313379840widget%3DTweet

Indian celebs attend to Cannes Film Festival

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News