Sunday, December 22, 2024

సరిహద్దులో మిఠాయిలు పంచుకున్న భారత్, చైనా సైనికులు

- Advertisement -
- Advertisement -

దీపావళి సందర్భంగా భారత్, చైనా సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో సరిహద్దు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద గురువారం భారత్, చైనాలు స్వీట్లు మార్చుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

బుధవారం డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్లెయిన్స్‌ రెండు రాపిడి పాయింట్ల వద్ద ఇరు పక్షాల దళాలు ఉపసంహరణను పూర్తి చేశాయని, ఈ పాయింట్ల వద్ద పెట్రోలింగ్ త్వరలో ప్రారంభమవుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, సరిహద్దులో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయినట్లు ఆర్మీ అధికారులు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News