Monday, December 23, 2024

గుజరాత్ తీరంలో 10 మందితో ఉన్న పాక్ బోటు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Indian Coast Guard apprehends Pakistan boat with 10 crew members

అహ్మదాబాద్ : గుజరాత్ తీర సముద్రజలాల్లో శనివారం రాత్రి 10 మందితో ఉన్న పాక్ బోటును ఇండియన్ కోస్టల్ గార్డు (ఐసిజి) పట్టుకుంది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో యాసీన్ పేరుతో ఉన్న పాక్‌బోటును, అందులోని 10 మందిని భారత కోస్తా రక్షణ దళ నౌక అంకిత్ పట్టుకుందని అధికారులు తెలియచేశారు. ఆ బోటును తదుపరి విచారణ కోసం పోర్‌బందర్‌కు తీసుకెళ్లడమైందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్ తీరం లోనే 12 మందితో ఉన్న పాక్ బోటను ఐసిజి పట్టుకుంది. డిసెంబర్ 20 న ఆరుగురితో ఉన్న పాక్ చేపల బోటును పట్టుకుని రూ. 400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News