నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దేశాభివృద్ధికి తోడ్పడాలి: రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పిలుపు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ప్రస్తుతం ఉన్న జనరేషన్ మార్పు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత కంపెనీలు గ్లోబల్ లీడర్‌లుగా ఎదగాలని, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దేశాభివృద్ధికి తోడ్పడాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా, కందిలోని హైదరాబాద్ ఐఐటిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా ‘ఏక్ పే డ్ మాకేనామ్’ పేరిట ఐఐటి ఆవరణలో ఆయన మొక్కను నాటారు. ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ, పలు అంశాలను విద్యార్థులతో ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులు, భాషల నేపథ్యం భారతదేశమని, 5 వేల సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశం మేధోపరంగా ఉన్నతంగా ఉందని అన్నారు.
అభివృద్ధి, ఆవిష్కరణలపై కార్పొరేట్ పెట్టుబడి అవసరాన్ని ప్రాముఖ్యతగా పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్‌ను ఆలోచన, ఆవిష్కరణ, సాధనలో అగ్రగామిగా నిలిపినందుకు ప్రశంసించారు. ఈ సంస్థ సాంకేతిక పురోగతికి చేసిన గొప్ప కృషిని, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో దాని పాత్రను కొనియాడారు. ఇక్కడి 300 మం ది ప్రతిభావంతులైన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఐఐటిల శాస్త్రీయ పరిశోధనలతో 20 కో ట్ల మంది రైతులు నేరుగా బ్యాంకుల్లో ప్రోత్సాహం పొం దుతున్నారని తెలిపారు. పరిశోధనలు, ఆవిష్కరణలతో డి జిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిందని అన్నారు. విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గ్లోబల్ లీడర్‌గా ఎ దగాలని పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, ఒకసారి పార్లమెంటును సందర్శించాలని కోరారు. చంద్రయాన్ తొలి దశలో విఫలమయినప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజయవంతం చేశామని అన్నారు. ఐఐటి విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వ్యాపారవేత్తలుగా రాణించాలని సూచించారు. హైదరాబాద్ ఐఐటిని సందర్శించడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్‌కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మెదక్ ఎంపి రఘునందన్‌రావు, ఐఐటి ఛైర్మన్ మోహన్‌రెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి వేదికపై ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచం ద్ర, మాజీ ఎంపి విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎస్‌పి రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఆదివారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి భారత ఉప రాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్‌ఖడ్, సుదేష్ ధన్‌ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చే రుకున్న ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రా ష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర డిజిపి జితేందర్, ప్రొటొకాల్ జాయింట్ సెక్రటరీ ఎస్.వెంకట్రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, రం గారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి, ఇతర నాయకులు స్వాగ తం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉపరాష్ట్రపతి దంప తులు కంది ఐఐటీకి బయలుదేరి వెళ్ళారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి దంపతులు శంషాబాద్ విమానాశ్రయం చే రుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.