Wednesday, November 6, 2024

ఆర్చరీలో భారత్‌కు రెండు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతన్న ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్4 ఛాంపియన్‌షిప్‌లో భారత్ శనివారం రెండు స్వర్ణాలను సాధించింది. పురుషులు, మహిళల టీమ్ కంపౌండ్ విభాగంలో భారత్‌కు పసిడి పతకాలు లభించాయి. మహిళల విభాగంలో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన భారత బృందం హోరాహోరీ ఫైనల్లో విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. మెక్సికోతో నువ్వానేనా అన్నట్టు ఆసక్తికరంగా సాగిన

తుది సమరంలో భారత్ 234233 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తెలుగుతేజాలు సురేఖ, అదితిలు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. మరోవైపు పురుషుల కంపౌండ్ టీమ్ విభాగంలో కూడా భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఓజాస్ తియోతలే, ప్రథమేశ్ జావ్‌కర్, అభిషేక్ వర్మలతో కూడి భారత బృందం ఫైనల్లో అమెరికా టీమ్‌ను ఓడించింది. ర్యాంకింగ్స్‌లో తమకంటే మెరుగైన స్థానంలో అమెరికా జట్టును భారత్ 236232 పాయింట్ల తేడాతో ఓడించి పసిడి పతకం సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News