Monday, December 23, 2024

భారత రాజ్యాంగం జాతీయ సమైఖ్యతకు హామీ

- Advertisement -
- Advertisement -

 

సదాశివనగర్ : 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపిపి గైని అనసూయ రమేష్, ఎంపిడిఓ కొండ లక్ష్మీ డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు,ప్రజాప్రతినిధులతో భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. ఎంపిటిసీ జయశ్రీ రమేష్ రావు, ఎంపిఓ సురెందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడిల దత్తురావు, జూనియర్ అసిస్టెంట్ శేశాచారి కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

అడ్లూర్ ఎల్లారెడ్డిలో సహాకార సంఘం అద్యక్షుడు మర్రి సదాశివరెడ్డి భారత రాజ్యాంగం గురించి వివరించి రాజ్యాంగ ప్రవేశివ పఠనం చేయించారు. విడిసీ చైర్మన్ ఎడ్ల నర్సింలు, వార్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డి,ఆకుల లింగం, నితిన్ గౌడ్, కట్ట రాజయ్య,గంగారాం,మాజి ఉప సర్పంచ్ లింగం,బి.సాయిలు, శేకెల్లి మహెందర్,ఆస రాజు, ఆబిద్, అజర్, సాయి, రమేష్ లు ఉన్నారు. పద్మాజివాడిలో అంబేద్కర్ యువన సంఘం ఆద్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ప్రవేశివ ప్రతిజ్ఞ చేసారు. పంచాయతీ కార్యదర్శి యుగెందర్ రెడ్డి, మామిండ్ల సుదర్శన్, కవీన్, రాజు, చంద్రకళ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News