Wednesday, January 22, 2025

భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం కన్నుమూశారు. ఆయన తన 12 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో 1967, 1979 మధ్య భారతదేశం తరపున 67 టెస్టులు ఆడాడు. ఆ సమయంలో 266 వికెట్లు తీశాడు. భారత్ తరఫున 10 వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచవ్యాప్తంగా స్పిన్ బౌలింగ్ కళలో విప్లవాత్మక మార్పులు చేశారు. 1970లో పద్మశ్రీ విజేతగా నిలిచిన బేడీ 22 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

1969-70లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన బేడీ 21 వికెట్లతో సిరీస్‌ను ముగించాడు. అనంతరం వెనక్కి తిరిగి చూడలేదు. ఇంగ్లండ్‌పై 25 వికెట్లు, వెస్టిండీస్‌పై మరో 18, ఇంగ్లండ్‌పై మరో 22, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై మళ్లీ 25, 31 వికెట్లు తీసిన బేడీ ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్‌లలో ఒకరిగా రికార్డు నెలకొల్పారు.

బేడీ 1978-79, 1980-81లో రంజీ ట్రోఫీలో ఢిల్లీకి వరుస టైటిల్స్‌కు నాయకత్వం వహించాడు. అంతేకాకుండా, బేడీ కౌంటీ క్రికెట్‌లో దిగ్గజంగా ఎదిగాడు. అక్కడ అతను నార్తాంప్టన్‌షైర్ తరపున 102 ఫస్ట్-క్లాస్ గేమ్‌లు ఆడాడు.  1972 నుండి 1977 వరకు 434 వికెట్లు తీసుకున్నాడు. ఆయన మృతిపట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News