Sunday, December 22, 2024

బలహీనపడుతున్న రూపాయి

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రపంచ పరిస్థితుల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్‌తో పాటు భారత్ కరెన్సీ కూడా పతనమవుతున్నాయి. డాలర్ నిరంతరం పెరుగుతోంది, దీని కారణంగా భారతీయ కరెన్సీ విలువ ప్రభావితమవుతుంది. రూపాయి విలువ వరుసగా మూడో సెషన్‌లోనూ పతనమవుతోంది. ప్రస్తుతం అమెరికా డాలర్‌తో రూపా యి మారకం విలువ 6 పైసలు పడిపోయి ప్ర స్తుతం 83.23 వద్ద ట్రేడవుతోంది.

ఈ పరిస్థితిపై ఫారెక్స్ వ్యాపారులు మాట్లాడుతూ, మధ్యప్రాచ్య దేశాలలో ఉద్రిక్తత, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారులు భా రీ అమ్మకాల కారణంగా భారతీయ కరెన్సీ కూ డా క్షీణిస్తోందని తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫా రెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి 83.19 వద్ద ప్రారంభమైన తర్వాత డాలర్‌కు 83.23కి పెరిగింది. గతంతో పోలిస్తే ఇది 6 పైసలు తగ్గింది. సోమవారం రూపాయి 4 పైసలు పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News