- Advertisement -
డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ వేగంగా రికవరీ
ముంబై : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మళ్లీ కోలుకుంటోంది. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పెరగడం, దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్ల కారణంగా శుక్రవారం రూపాయి 45 పైసలు పెరిగింది. ఆఖరికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 79.24 వద్ద ముగిసింది. విదేశీ మూలధన ప్రవాహం దేశీయ మార్కెట్ల మద్దతుగా నిలుస్తోందని ఫారెక్స్ డీలర్లు పేర్కొంటున్నారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్‌లో దేశీయ కరెన్సీ 79.55 వద్ద ప్రారంభించింది. ఆ తర్వాత 79.56 నుంచి 79.17 మధ్య కనిపించింది. ఆఖరికి డాలర్‌పై 45 పైసలు లాభంతో 79.24 వద్ద స్థిరపడింది.
- Advertisement -