Sunday, February 23, 2025

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఓ ఇండియన్ బలి

- Advertisement -
- Advertisement -

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఓ యుద్ధంలో భారతీయుడు బలయ్యాడు. డోనెట్స్క్ ప్రాంతంపై ఈ నెల 21న జరిగిన మిసైల్ దాడిలో హేమిల్ అశ్విన్ భాయ్ మంగుకియా అనే భారతీయుడు మరణించగా, మరొకరు తప్పించుకున్నారు. హేమిల్ గత డిసెంబర్లోనే రష్యా వెళ్లాడు. అతన్ని సైన్యంలోకి తీసుకున్నారు. హేమిల్ షూటింగ్  ప్రాక్టీస్ చేస్తుండగా మిసైల్ దాడి జరిగిందని, అతను అక్కడికక్కడే చనిపోయాడని హేమిల్ స్నేహితుడు సమీర్ అహ్మద్ చెప్పాడు. తాను, మరో ఇద్దరు భారతీయులు ఓ కందకంలో దాక్కొని ప్రాణాలు రక్షించుకున్నామని తెలిపాడు. మృతుడు హేమిల్ స్వస్థలం సూరత్ పట్టణమని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News