Wednesday, January 22, 2025

కవ్విస్తే భారత్ సింగమే అవుతుంది

- Advertisement -
- Advertisement -

Indian Defense Minister Rajnath indirectly fires on china

చైనాకు రక్షణ మంత్రి చురక

వాషింగ్టన్ : హానీ కల్గిస్తే గాయపరిస్తే భారత్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ శాంతి కపోతంగా ఉంటుంది. అయితే కవ్వింపు చర్యలకు పాల్పడే వారి పట్ల సింగం అవుతుందని హెచ్చరించారు. చైనా చర్యలను పరోక్షంగా దృష్టిలో పెట్టుకుని రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలకు దిగారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. 2 ప్లస్ 2 మంత్రుల స్థాయి భేటీలో భాగంగా అమెరికా రక్షణ మంత్రితో కీలక భద్రతా విషయాలను సమీక్షించారు. ఇదే దశలో ఆయన గురువారం శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ సంతతి వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇతర దేశాలతో భారత సంబంధాలు నిర్థిష్టంగా ఉంటాయి.

స్పష్టత ఉండనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఒక్క దేశంతో సంబంధాలు నెరిపే క్రమంలో వేరే దేశంతో తెగతెంపుల ప్రసక్తి ఉండదని, ఇదే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యపు కేంద్ర ప్రభుత్వ పాలసీ అని అమెరికాను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. ఎక్కువ తక్కువల అంచనాలతో భారతదేశ విధానాలు ఖరారు కాలేదని , దేశీయ ప్రయోజనాల కోణంలోనే అన్ని అంశాల ప్రస్తావన ఉంటుందన్నారు. జీరో సమ్ గేమ్ డిప్లోమసీ తమ దేశానికి నచ్చదని తేల్చిచెప్పారు. ఇక్కడి ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో రాజ్‌నాథ్‌కు స్వాగత కార్యక్రమం ఏర్పాటు అయింది. చైనా సరిహద్దులలో భారతీయ జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. భారత్ ఎవరికి తలవంచదు. ఎవరైనా చికాకు కల్గిస్తే చూస్తూ సహించదని, దెబ్బకు దెబ్బ విధానం పాటిస్తుందని స్పష్టం చేశారు. గల్వాన్ వ్యాలీలో చైనా ఘర్షణల తంతును రక్షణ మంత్రి ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News