Monday, December 23, 2024

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కేంబ్రిడ్జ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగించారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నారు. అంతేకాక తన ఫోన్‌లో ఇజ్రాయెల్ గూఢచర్య స్పైవేర్ ‘పెగాసస్’ను కూడా చొప్పించారని పేర్కొన్నారు. తన కాల్స్ రికార్డు చేయబడుతున్నాయి కనుక తనతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన ఇంటెలిజెన్స్ అధికారులను హెచ్చరించారు. రాహుల్ గాంధీ ప్రసంగం యూట్యూబ్ లింక్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారు శామ్ పిట్రోడా షేర్ చేశారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్‌లో ఎంబిఎ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘లెర్నింగ్ టు లిజెన్ ఇన్ ద 21స్ట్ సెంచరీ’ అనే టాపిక్‌పై మాట్లాడారు.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ గూఢచర్యానికి ఉపయోగిస్తున్న ‘పెగాసస్’ స్పైవేర్‌ను 29 మొబైల్ ఫోన్స్‌లో పరిశీలించిందని, కానీ ఐదు ఫోన్లలో మాత్రమే ఉన్నట్లు కనుగొనిందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు. భారత భారత పార్లమెంటులో, ప్రెస్‌పై, జ్యూడీషియరీపై అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా రాహుల్ గాంధీ చెప్పారు.

‘భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందన్నది అందరికీ తెలుసు. భారత్‌లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ప్రజాస్వామ్యానికి ఊతంగా ఉండే పార్లమెంటు, పత్రికాస్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, కదలికలపై నిఘా ఉంది. మేము భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నది అనుకుంటున్నాము’ అని రాహుల్ గాంధీ అన్నారు.

అమెరికా రాజ్యాంగం వలెనే భారత రాజ్యాంగం కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరగాలంటోంది. కానీ అది కూడా దాడికి గురవుతున్నది. పార్లమెంటు భవనంలో ఏమి జరుగుతోందో కూడా మీరు చూడవచ్చు. అక్కడ మేము ఏదేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో తోయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇలా మూడు నాలుగు సార్లు జరిగింది. పైగా అది దౌర్జన్యకరంగా ఉండింది. మైనారిటీలపై, ప్రెస్‌పై దాడులు జరగడం గురించి మీరు వినే ఉంటారు. భారత్‌లో ఏమి జరుగుతుందో మీరు గ్రహించి ఉంటారు’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News