- Advertisement -
ప్రపంచ సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభావం ఉండదు: ఆర్‌బిఐ
ముంబై : రష్యా ఉక్రెయిన్ మధ్య సంక్షోభం కారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారతదేశంలో నిలకడగా పురోగతి సాధిస్తుందని ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) పేర్కొంది. కొవిడ్ థర్డ్ వేవ్‌ను నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌పై తాజా పరిస్థితుల ప్రభావం అంతగా ఉండబోదని ఆర్‌బిఐ తెలిపింది. దేశీయ స్థూల ఆర్థిక మూలాలు ఇప్పటికీ పటిష్ఠంగా ఉన్నాయంటూ ‘ఆర్థిక వ్యవస్థ దశ’ పేరిట ఆర్‌బిఐ బులెటిన్‌లో పెర్కొంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థను అస్థిరతకు గురిచేయనున్నాయని, ఇప్పటికే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్న వరల్డ్ ఫైనాన్స్ మళ్లీ కష్టాలను ఎదుర్కోనుందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది.
- Advertisement -