న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటుగా తమ పౌరులను ఆ దేశంలో ఉండడం అవసరమని భావించకపోతే తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని మరోసారి కోరింది. అంతేకాదు, భారతీయ పౌరులు, విద్యార్థులను ఉక్రెయిన్‌ను తాత్కాలికంగా విడిచిపెట్టి రావాలని సూచించింది. అలాగే భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించి అప్‌డేట్ల కోసం సంబంధిత స్టూడెంట్ కాంట్రాక్టర్లను కూడా సంప్రదించాలని, అలాగే ఎంబసీ ఫేస్‌బుక్, వెబ్‌సైట్, ట్విట్టర్‌లను అనుసరించాలని సూచించింది. సమాచారం, సహాయం అవసరమైన ఉక్రెయిన్‌లోని భారతీయులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కూడా సూచించింది. ప్రభుత్వం ఇటీవల టాటా గ్రూప్‌కు విక్రయించిన ఎయిరిండియా ఈ నెల 22,24,26 తేదీల్లో ఉక్రెయిన్‌కు మూడు ప్రత్యేక విమానాలను నడపనుంది. ఈ విమానాలు ఉక్రెయిన్‌లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి నడుస్తాయి.
Indian Embassy alerts citizens to leave Ukraine