- Advertisement -
కీవ్ : ఉక్రెయిన్‌లో మూతపడి ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ నెల 17న తిరిగి తెరుచుకుంటుంది. రష్యా దాడుల ఉధృతి దశలో ఫిబ్రవరి 24వ తేదీన భారత ఎంబస్సీకి తాళాలు పడ్డాయి. మార్చి 13న ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయ కార్యకలాపాలు అన్ని కూడా వార్సాలో ఆరంభం అయ్యాయి. ఇక్కడి నుంచే ఉక్రెయిన్‌లో చిక్కుపడ్డ భారతీయుల తరలింపులు జరిగాయి. వచ్చేవారమే కీవ్‌లో భారత ఎంబస్సీ పునరుద్ధరణ జరుగుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం నాటి సమాచారంలో తెలిపింది. రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులు తీవ్రరూపం దాల్చిన దశలో నష్టనివారణకు ముందుగానే భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా అక్కడి నుంచి తరలించారు.
- Advertisement -