Tuesday, March 4, 2025

సైబర్‌స్కామ్ సెంటర్ల నుంచి 67 మంది భారతీయులకు విముక్తి

- Advertisement -
- Advertisement -

లావోస్ లోని సైబర్‌స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 67 మంది భారతీయులను ఇండియన్ ఎంబసీ రక్షించగలిగింది. లావోస్ లోని బొకియో ప్రావిన్స్‌లో గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (జిటిఎస్‌ఇజెడ్) నిర్వహిస్తున్న క్రిమినల్ సిండికేట్స్‌లో వీరిని బలవంతంగా బెదిరించి పనిచేయిస్తున్నారని ఇండియన్ మిషన్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అక్కడ చిక్కుకున్న వీరి అభ్యర్థనల మేరకు ఒక బృందాన్ని ఇండియన్ ఎంబసీ జిటిఎస్‌ఇజెడ్‌కు పంపింది.

లావో అధికారులతో సమన్వయంతో చర్చించి భద్రంగా 67 మంది భారతీయులను విడిపించగలిగింది. బొకియో నుంచి వియంటైన్‌కు వారిని తరలించింది. అక్కడ వీరికి వసతి, ఆహారం, ఇతర అవసరాలను సమకూర్చింది. లావోస్‌లో ఉన్న భారతీయ రాయబారి ప్రశాంత్ అగర్వాల్ 67 మంది భారతీయులను కలుసుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. వారికి ఎలాంటి కష్టనష్టాలు ఎదురుకావని భరోసా ఇచ్చారు. తదుపరి చర్యలపై వారికి సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News