Sunday, December 22, 2024

పాలస్తీనాలో భారత రాయబారి అనుమానస్పద మృతి

- Advertisement -
- Advertisement -

Indian Envoy Mukul Arya died in Palestine

న్యూఢిల్లీ: పాలస్తీనాలో భారత రాయబారిగా ఉన్న ముకుల్ ఆర్య అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. రమల్లాలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిపై విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. ‘ముకుల్ ఆర్య మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను ఎంతో తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి. ముకుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని జయశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ మృతి చెందాడన్న వార్త తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ అబ్బాస్, ప్రధాని ముహమ్మద్ ష్టాయే భద్రత, పోలీస్, ఆరోగ్య, ఫోరెన్సిక్ అధికారులను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ముకుల్ భౌతికకాయాన్ని తరలించేందుకు భారత విదేశీ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముకుల్ ఐఎఫ్‌సి 2008 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయన ఇదివరలో కాబుల్, మాస్కోల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా పనిచేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా పనిచేశారు.

Indian Envoy Mukul Arya died in Palestine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News