Wednesday, January 22, 2025

అబూధాబీ లాటరీ గెలిచిన భారతీయుడు! ఎన్ని కోట్లు గెలిచాడంటే…

- Advertisement -
- Advertisement -

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు. అబూధాబీలో భారతీయ సంతతికి చెందిన రాజీవ్ అరిక్కట్ అనే వ్యక్తికి కూడా అదృష్టం తలుపు తట్టింది. ఇంకేముంది… లాటరీ రూపంలో కోట్ల రూపాయల నగదు బహుమతి వరించింది. రాజీవ్ అబూధాబీలో స్థిరపడ్డాడు. మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నా, ఎప్పుడూ అవి తగిలిన దాఖలాలు లేవు. కానీ గత వారం అతను కొన్న బిగ్ టికెట్ అబూధాబి వీక్లీ డ్రాలో అదృష్టం వరించింది. ఏకంగా 15 మిలియన్ దిర్హామ్ లు (33,89,58,127 రూపాయలు) లభించాయి.

రాజీవ్ అబూధాబీలోని అల్ ఐన్ లో ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మాన్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్ ఆన్ లైన్ లో తాను కొన్న టికెట్ ను బంధుమిత్రులకు పంపించాడు. “ఇంత పెద్ద మొత్తాన్ని నేను గెలుచుకున్నానంటే నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఓ కలలా ఉంది” అని అతను బిగ్ టికెట్ ఆర్గనైజర్లతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News