Friday, December 27, 2024

కేన్స్ 2022: ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్నషౌనక్ సేన్ ‘ఆల్ దట్ బ్రీత్స్’

- Advertisement -
- Advertisement -

 

All that breaths win documentary award

కేన్స్:  ఢిల్లీకి చెందిన చిత్రనిర్మాత షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ప్రతిష్టాత్మక L’OEil d’Or అవార్డును కైవసం చేసుకుంది. ‘ది గోల్డెన్ ఐ’ అని కూడా పిలిచే అతిపెద్ద డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’  అనేది అనేక విషయాల గురించి రూపొందించిన సృజనాత్మక డాక్యుమెంటరీ చిత్రం. పక్షులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన సోదరుల జంట కథ ఇది. 90 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, గాయపడిన పక్షులను, ముఖ్యంగా బ్లాక్‌ కైట్‌లను రక్షించడానికి , చికిత్స చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన తోబుట్టువులు మొహమ్మద్ సౌద్ , నదీమ్ షెజాద్‌లకు సంబంధించింది.

వైల్డ్‌లైఫ్ రెస్క్యూ యొక్క దైనందిన జీవితాన్ని ,  పోరాటాలను ఈ డాక్యుమెంటరీ చక్కగా ప్రతిబింబిస్తుంది.  దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఒక నేలమాళిగలో ఇద్దరు సోదరులు మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ స్థాపించిన NGO వారి ప్రియమైన జీవుల కోసం పక్షుల ఆసుపత్రి. ఈ సంవత్సరం ప్రారంభంలో, ‘ఆల్ దట్ బ్రీత్స్’ సన్‌డాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ కూడా గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News