Friday, November 22, 2024

భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

స్పందించిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా తోడ్పడుతున్న 15 భారత సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. దాని తాలూకు జాబితా కూడా విడుదల చేసింది. కాగా దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సమస్యను పరిష్కరించుకోడానికి అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు  తెలిపింది. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన జాబితాలో భారత్ కు చెందిన  అనేక కంపెనీలు ఉన్నాయి. రష్యాకు చైనా, భారత్ తో పాటు అనేక దేశాల కంపెనీలు సహకరిస్తున్నాయని అమెరికా మండిపడుతోంది. కాగా భారతీయ కంపెనీలపై ఆంక్షలు విధించడంపై భారత్, అమెరికా నుంచి స్పష్టీకరణ కోరింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News