Friday, December 27, 2024

బెయిల్‌పై విడుదలైన విహెచ్‌పి నాయకుడు ప్రేమ్ శర్మ

- Advertisement -
- Advertisement -

 

Prem Sharma

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(విహెచ్‌పి) స్థానిక నాయకుడు ప్రేమ్ శర్మ శనివారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో అనుమతి లేకుండా హనుమాన్ జయంతి ఊరేగింపు నిర్వహించాడు. కాగా అతడిని సోమవారం అరెస్టు చేశారు. కానీ తర్వాత బెయిల్ మీద వదిలిపెట్టారు. శనివారం సాయంత్రం జరిగిన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల్లో తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే పోలీసుల నుంచి అనుమతి పొందాకే శనివారం శోభాయాత్ర చేపట్టామని, కాగా ఘర్షణ సమయంలో హిందూ విగ్రహం, భారతీయ జెండా ధ్వంసమయ్యాయని ఆయన ఆరోపించాడు. “మేము రెండు చోట్ల ..మహేంద్ర పార్క్, జహంగిర్‌పురి పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతిని తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఊరేగింపు ఎలాంటి సమస్య లేకుండానే నిర్వహించబడుతోంది. ఈ ఊరేగింపులో 400కుపైగా మంది పాల్గొంటారని, మ్యూజిక్ సిస్టం కూడా ఉంటుందని మేము పోలీసులకు ముందే తెలిపాము. అంతేకాకుండా మేము వారికి మా రూటును కూడా తెలిపాము” అని చెప్పుకొచ్చాడు. “మేము ముందే చెప్పనట్టయితే 15 నుంచి 20 మంది పోలీసులు, వారి వాహనాలు ఎలా వచ్చాయక్కడికి? మేము ప్రతిది పోలీసులకు తెలిపాము. మేము ఓ లేఖను కూడా సమర్పించి పోలీసు సంతకం తీసుకున్నాం. ఊరేగింపు సందర్భంగా బాలాజీ విగ్రహం ధ్వంసమైంది. భారత జాతీయ పతాకం ధ్వంసంమైంది. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? ఎవరు రాళ్లు, కత్తులు ఉపయోగించారో వాళ్లను అరెస్టు చేయాలి. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు పరుగులు పెట్టాము” అని వివరించాడు. ఊరేగింపు జరిగిన సందర్భంగా తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 6 గంటలకు అరాచకవాదులు రాళ్లు రువ్వారు, కొన్ని వాహనాలను తగులబెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News