Monday, January 20, 2025

బర్మింగ్‌హామ్‌లోని సిడబ్ల్యుజి గ్రామంలో భారత జెండా ఎగురవేత

- Advertisement -
- Advertisement -

 

Indian athlets

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్ 2022  ప్రారంభోత్సవం సందర్భంగా బర్మింగ్‌హామ్ లోని  అథ్లెట్స్ గ్రామంలో భారత జెండాను ఎగురవేశారు. జాతీయ జెండా ఎగువేత సమయంలో భారత్ కు చెందిన క్రీడాకారులందరూ పాల్గొన్నారు. భారత ఒలింపిక్ సంఘం యాక్టింగ్ ప్రెసిడెంట్ అనిల్ ఖన్నా , ఐఓఎ కోశాధికారి ఆనందేశ్వర్ పాండే, ఆటల డిప్యూటీ చెఫ్ డి మిషన్ అనిల్ ధుపర్, ఇండియన్ ఓలింపిక్ అసోసియేషన్ సంఘం అధికారులు, భారత జట్టు చెఫ్ డి మిషన్ రాజేశ్ భండారీ సమక్షంలో సంగీత, నృత్య ప్రదర్శన మధ్య భారత జాతీయ పతాకం ఎగురవేత వేడుక జరిగింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022 నేటి(జూలై 28)   నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. భారత్ తరఫున 215 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. వారు 19 ఆటలకు(స్పోర్టింగ్ డిసిప్లయిన్స్) సంబంధించిన 141  ఈవెంట్లలో పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News