Thursday, December 19, 2024

భారత ఫుట్‌బాల్ దిగ్గజం హబీబ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ దిగ్గజం, హైదరాబాదీ మహ్మద్ హబీబ్ (74) మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్‌కు చెందిన హబీబ్ 60, 70 దశకాల్లో భారత స్టార్ ఫుబ్‌బాల్ ఆటగాళ్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు. హబీబ్ కొన్నేళ్ల నుంచి డిమెన్షియా తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. మంగళవారం దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో అలనాటి ఫుట్‌బాల్ దిగ్గజం హబీబ్ మృతి చెందడం క్రీడా లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. హబీబ్ తన కెరీర్‌లో 30 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1970లో ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన భారత జట్టులో హబీబ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News