Thursday, December 12, 2024

9న బంగ్లాదేశ్ కు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న బంగ్లాదేశ్ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విక్రమ్ మిశ్రీ  తన పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శితో పాటు అనేక మంది ఇతరులతో కూడా ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొననున్నారని జైస్వాల్ తెలిపారు.

బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులపై దాష్టికాలు పెరిగిపోయాయి. హిందూ ఆధ్యాత్మిక ప్రముఖుడు చిన్మయ్ కృష్ణ దాస్ ను కూడా అరెస్టు చేసి బందీగా ఉంచారు. ఇదిలావుండగా కోల్ కతాలో యాక్టింగ్ డిప్యూటీ హై కమిషనర్ గా ఉన్న షిక్దర్ ముహమ్మద్ అష్రఫుర్ రహ్మాన్ ను బంగ్లాదేశ్ వెనక్కి పిలిపించుకుంది. రహ్మాన్ బంగ్లాదేశ్ రాజకీయ వ్యవహారాల మంత్రి కూడా. ఆయన ఢాకాకు తిరిగి వెళ్లిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News