Tuesday, January 21, 2025

మైదానాలు

- Advertisement -
- Advertisement -

పంజాబ్ హర్యానా మైదానం

Indian geography in telugu bits

పంజాబ్, హర్యానా సారవంత మైదానాలు భారత ఎడారికి ఈశాన్య దిశలో ఉన్నాయి.
ఈ మైదానాలు ఈశాన్య దిశ నుండి నైరుతి దిశకు సుమారు 640 కిలోమీటర్లు వ్యాపించాయి.
ఇవి పశ్చిమం నుండి తూర్పుకు 300 కి.మీ విస్తరించి ఉన్నాయి.
పంజాబు హర్యానా మైదానాలు సట్లెజ్, బియాస్, రావి నదులచే వచ్చే అవక్షేపాలతో నిర్మితమయ్యాయి.
రాజస్థాన్ మైదానాలకు సరిహద్దులో గల ఈ మైదానాలు ఆగ్నేయ భాగం ఇసుకతో నిండి ఉంటాయి.
హర్యానాలోగల గాగ్రా, యమునా నదికి మధ్య హర్యానా మైదానం ఏర్పడింది. ఇది యమునా సట్టెజ్‌కి మధ్య జల విభాజకంగా పనిచేస్తుంది.
నోట్: రెండు నదుల మధ్య గల ఒండలి మట్టి నేలను అంతర్వేది అంటారు.
ఉదాహరణకు గంగా, యమునా నది మధ్య గల మైదానం.
గంగా మైదానం
గంగా మైదానం విశాలమైన మైదానం.
ఇది పశ్చిమానగల బంగ్లాదేశ్ వరకు సుమారు 1500 కి.మీ పొడవున.. 300 కి.మీ వెడల్పుతో విస్తరించి ఉంది.
ఇది యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్‌లో విస్తరించింది.
గంగానదికి ఉత్తరం నుండి ప్రవహించే ఉపనదులు రాంగంగా, గోమతి, గాగ్రా, గంధక్, కోసి, యమున.
అలాగే దక్షిణం నుండి సోన్ చంబల్, బెట్వా మొదలైన నదులు ప్రవహిస్తాయి.
గంగా ఉపనదులు క్రమంగా పర్వతాలు, పీఠభూముల నుండి అధిక మొత్తంలో ఇసుక, బురదను తీసుకొచ్చి విశాలమైన మైదానాలను ఏర్పరిచాయి.
ఈ మైదానాల మొత్తం వాలు తూర్పు, ఆగ్నేయ దిశవైపుకు ఉంటుంది.
సముద్ర మట్టానికి పైన ఈ మైదానం సరాసరి ఎత్తు సుమారు 200 మీటర్లు ఉంటుంది.
ఈ మైదానం పశ్చిమభాగాన గంగా యమున అంతర్వేది ఉన్నాయి.
అంతర్వేది తూర్పున లోతట్టు రోహిల్‌ఖండ్ అమరి ఉంది.
మధ్య భాగంలో నదుల ప్రవాహాలు నెమ్మదిగా ఉంటాయి.
చాలా నదులు వాటి గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి.
నదులు తమ గమనాన్ని మార్చుకోవడం తో ఈ ప్రాంతంలో తరచుగా వరదలు సంభవించుటకు కారణమవుతున్నాయి.
హరిద్వార్, మథుర, వారణాసి, అలహాబాదు మొదలైన పవిత్ర స్థలాలు నదుల ఒడ్డు వెంట ఏర్పడ్డాయి.
ఈ పవిత్ర స్థలాలున్న ప్రాంతాలు విద్యా, విహార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
బిహార్ ధు:ఖదాయనిగా పిలవబడే కోసి నది ఇటీవల కాలంలో దీని మార్గాన్ని వంద కి.మీ వరకు మార్చుకుంది.
లోతట్టు ప్రాంతంలో గంగ, బ్రహ్మపుత్ర నదులు అనేక కాలువలుగా విభజన చెంది ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టాను ఈ ప్రాంతంలో ఏర్పరుస్తుంది.
డెల్టా కింది భాగాలను సుందర వనాలు అంటారు. ఇది దట్టమైన టైడల్, మాంగ్రోవ్ అరణ్యాలు ఆక్రమించి ఉంటాయి.
డెల్టా సముద్ర ముఖాభి ప్రాంతం అనేక ఉప్పు కయ్యలు, బురదతో కూడిన చిత్తడినేలలు, ఇసుక తీరాలు, దీవులను కలిగి ఉంటాయి.
బ్రహ్మపుత్ర మైదానం..
ఉత్తర మైదానం తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర ప్రవహిస్తోంది. దీని అనేక ఉపనదులచే మైదానాలు ఏర్పడ్డాయి.
బ్రహ్మపుత్ర నది టిబెట్టులో జన్మించింది. దీనిని స్థానికంగా సాంగ్‌పో అని అంటారు.
ఈ నది దిహాంగ్ లోయ ద్వారా ప్రవహించి అస్సాం గుండా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది.
ఉత్తరాన అస్సాం కొండలు నుండి అనేక ఉపనదులు ప్రవహిస్తాయి. ఈ ప్రాంతం లో పెద్ద బురదతో కూడి ఉంటుంది.
ఒండలి వీవనలు క్రమేణా టెర్రాయ్‌ను ఏర్పరుస్తాయి.
ద్వీపకల్ప పీఠభూమి..
l ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర మైదానాలకు దక్షిణాన ఉంది.
l ఇది త్రిభుజాకార ఆకృతిలో ఉంటుంది.
l ఇది సుమారు 16 లక్షల చ.కి.మీ విస్తీర్ణంను కలిగి ఉంటుంది.
l దీనికి ఉత్తరాన ఆరావళి, వింధ్య, సాత్పూరా కొండల శ్రేణులు, ఉత్తరాన రాజ్‌మహల్ శ్రేణి, పశ్చిమాన పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు ఆవరించి ఉన్నాయి.
l సముద్ర మట్టానికి దీని సరాసరి ఎత్తు 600 – 900 మీటర్ల వరకు ఉంటుంది.
l దీని ఏటవాలు పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉంటుంది.
l నర్మదా తపతి ప్రాంతంలో తూర్పు నుండి పశ్చిమం వైపుకు ఉంటుంది.
l నర్మదా నది, ద్వీపకల్ప పీఠభూమిని రెండు అసమ భాగాలుగా విభజించును. ఉత్తర భాగంను మధ్య ఉన్నత భూములు అని దక్షిణ భాగాన్ని దక్కను పీఠభూమి అంటారు.
మధ్య ఉన్నత భూములు..
l మాళ్వా పీఠభూమికి ఆరావళి శ్రేణులు, వింధ్య శ్రేణులు, బుందేల్ ఖండ్‌లు సరిహద్దులుగా ఉన్నాయి.
l ఇది లావాచే నిర్మితమై ఉంటుంది.
l నల్లరేగడి మన్నుచే ఆక్రమించబడి ఉంటుంది.
l ఛంబల్ నది, దీని ఉపనదులు దక్కను పీఠభూమి ఉత్తర భాగంలో ఇరుకైన అగాధ లోయలను ఏర్పరచుకుంది.
l బుందేల్ ఖండ్: యమునా నదికి దక్షిణాన ఉంది.
l ఇది అగ్ని శిలలు, రూపాంతర శిలలచే నిర్మితమై ఉంటుంది.
l ఉత్తర భాగంలో గంగా, యమున నదీ వ్యవస్థలు ఒండ్రు మట్టిని నిక్షేపించుతున్నాయి. కొండ ప్రాంతాలు ఇసుక రాళ్లు, నల్లరాయిచే నిర్మితమై ఉంటాయి.
l బెట్వా, కెన్ నదులు రాళ్లను కోతకోసి అగాధ సన్నని నదీలోయను ఏర్పరుస్తున్నాయి. బుందేల్ ఖండ్ మైకాలాశ్రేణికి తూర్పున ఉంది.
l ఇది పశ్చిమాన ఇసుకరాళ్లు, సున్నపు రాళ్లచే, తూర్పున నల్లని రాళ్లచే నిర్మితమై ఉంటుంది.
l దక్కను పీఠభూమి మధ్య భాగం సోన్, మహానది కాలువల ప్రవాహ ప్రదేశాల మధ్య జలవిభాజకంగా పనిచేస్తుంది.
l ఛోటానాగ్‌పూర్ పీఠభూమి ఈశాన్య దిశలో కలదు.
l దామోదర్, సువర్ణరేఖ, కోయల్, బరాకర్ నదులు దీని ద్వారా ప్రవహిస్తాయి.
l దామోదర్ నది ఈ ప్రాంతానికి మధ్యగా పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది.
l ఈ ప్రాంతం పీఠభూమి, కొండల పంక్తులను కలిగి ఉంటుంది.
l దామోదర్ నదికి ఉత్తరాన హజిరిబాగ్ పీఠభూమి, దక్షిణాన రాంచి పీఠభూమి, ఈశాన్య భాగాన రాజమహల్ కొండలు నెలకొన్నాయి.
దక్కను పీఠభూమి..
l ఇది సుమారు 5 లక్షల చ.కి.మీ వైశాల్యంను ఆక్రమించి ఉంటుంది.
l దీనికి వాయువ్యాన గల సాత్పూరా, వింధ్య పర్వత శ్రేణులు, ఉత్తరానగల మహాదేవ్, మైకాలా శ్రేణులు, పశ్చిమాన గల పశ్చిమ కనుమలు, తూర్పనగల తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి.
l అందువలన మహానది, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు నదులు తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఉత్తర భాగాన లావా పీఠభూమి అని అంటారు. ఇది లావా శిలలు, నల్లరేగడి మన్నుచే నిర్మితం.
l దక్షిణ భాగంలో గల కర్ణాటక పీఠభూమి నీలగిరి కొండలతో కలుస్తాయి. తెలంగాణా పీఠభూమి నుండి గోదావరి, కృష్ణ, పెన్నా నదులు ప్రవహిస్తున్నాయి.

ద్వీపకల్ప భారతదేశ పర్వత శ్రేణులు

ఆరావళి శ్రేణి..
ప్రపంచంలోని అతిపురాతన ముడుత పర్వతాలలో ఆరావళి పర్వతాలు ఒకటి. ఇవి ఈశాన్యం నుండి నైరుతి వైపునకు సుమారు 800 కి.మీ విస్తరించి ఉంటాయి.
ఉత్తరాన దీని సరాసరి ఎత్తు సుమారు 400 మీటర్లు, దక్షిణాన సుమారు 900 మీటర్లు ఉండును. అబు కొండలలో గల గురుషికర్ (1722మీ) ఆరావళి శ్రేణి ఎత్తైన శిఖరం.
ఆరావళి శ్రేణులు అధికంగా క్షయం చెంది ఛేదనం చెంది ఉంటాయి. అవశేష పర్వతములకు ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
వింధ్య శ్రేణులు..
నర్మదా లోయకు నిట్టనిలువుగా ఏటవాలుగా గోడ వలె ఉంది. ఇది తూర్పు పశ్చిమ దిశగా నర్మదా లోయకు సమాంతరంగా సుమారు 1200 కి.మీ వ్యాపించి ఉంది.
ఇది ఇసుక రాళ్లు, సున్నపు రాళ్లు, నల్లని, మెత్తని శిలలుచే నిర్మితమై ఉంటుంది.
ఇది గంగా నదీ వ్యవస్థలు, దక్షిణ భారతదేశ వ్యవస్థల మధ్య జల విభాజకంగా ఉంటుంది.
సాత్పూర శ్రేణి..
నర్మదా, తపతి నదుల మధ్య కలదు.
ఇది ఒక సప్త కొండల పంక్తులు. ఇది సుమారు 900 కి.మీ విస్తరించింది. సాత్పూరా శ్రేణిలో అధిక విభాగం 900 మీటర్లు కంటే అధిక ఎత్తును కలిగి ఉంది.
పశ్చిమ కనుమలు..
ఇవి ఉత్తర దక్షిణ దిశగా అవిచ్ఛిన్నంగా వ్యాపించి ఉన్నాయి.
దక్కను పీఠభూమి పశ్చిమ అంచుగా ఏర్పడింది.
ఇవి ఉత్తరాన తపతిలోయ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు సుమారు 1600 కి.మీ వ్యాపించి ఉన్నాయి.
పశ్చిమ వైపున నదులు వేగంగా ప్రవహిస్తాయి. శరావతి నది నుండి జోగ్ జలపాతం (270మీ) లాంటి అనేక జలపాతాలను ఏర్పరుస్తుంది.
పశ్చిమ కనుమల..తూర్పు దిశను క్రమమైన ఏటవాలుగా ఉండును. గోదావరి, కృష్ణ, కావేరి ప్రధాన నదులు తూర్పు ఏటవాలు నుంచి ఉద్భవించి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి.
పశ్చిమ కనుమలలో తాల్‌ఘాట్, బోర్‌ఘాట్, పాల్ఘాట్ అనే మూడు ప్రధానమైన కనుమలు ఉన్నాయి.
ఇవి పశ్చిమాన గల కొంకన్ మైదానం, తూర్పున గల దక్కను పీఠభూమికి మధ్య రహదారులు, రైలు మార్గాలకు దోహదపడుతుంది. తూర్పు కనుమలు, పశ్చిమకనుమలు నీలగిరి కొండల వద్ద కలుస్తాయి. దీనిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట (2637మీ).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News