- Advertisement -
హైదరాబాద్ : స్థిరమైన అభివృద్ధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో జియోస్పేషియల్ టెక్నాలజీ అమలు ఎంతో కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌ ందరరాజన్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జియోస్మార్ట్ ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్‌ను ఆమె ప్రారంభించారు. భారతదేశపు జియోస్పేషియల్ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం రూ.39,972 కోట్లుగా ఉంది. అయితే ఇది 12.8 శాతం వృద్ధితో 2025 నాటికి రూ.63,100 కోట్లకు చేరనుందని ఇండియా జియోస్పేషియల్ ‘అర్ధ’ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను జియోస్మార్ట్ ఇండియా 2021 వద్ద ప్రధానమంత్రి సలహాదారు అమిత్ ఖరే, డాక్టర్ కిరణ్ కుమార్, విక్రమ్ సారాభాయ్ ప్రొఫెసర్, ఇస్రో సమక్షంలో విడుదల చేశారు. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం, 2022 నాటికి భారత ప్రభుత్వం మూడు జియోస్పేషియల్ పాలసీలను అమలు చేయనుంది. ప్రస్తుతం ఇవి ముసాయిదా దశలో ఉన్నాయ.
- Advertisement -