- Advertisement -
న్యూయార్క్: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికాలోని పె న్సిల్వేనియా రాష్ట్రంలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
ఆమె మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరిస్తామని భారత కాన్సులేట్ ప్రకటించింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈమేరకు స్వచ్ఛంద సేవా సంస్థ టీమ్ ఎయిడ్ జోషి మృతదేహాన్ని ఢిల్లీలోని ఆమె కుటుంబానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని టీమ్ ఎయిడ్ సంస్థాపకులు మోహన్ నన్నపనేని పేర్కొన్నారు.
- Advertisement -