Friday, December 20, 2024

గ్లోబల్ కోడింగ్ సమూహంలో భారతీయ అమ్మాయిలు దూసుకుపోతున్నారు!

- Advertisement -
- Advertisement -
పాఠశాల ప్రిన్సిపాల్ నికితా తోమర్ మాన్ మాట్లాడుతూ…కోడర్ లేదా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ కెరీర్‌ను ఎంచుకునే వారికి మాత్రమే కోడింగ్ నైపుణ్యం అవసరమన్నది అపోహ అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎన్‌సిఆర్‌లో ఆరవ తరగతి చదువుతున్న ఆరాధ్య అవస్థికి కోడింగ్ అనేది సృజనాత్మకత, సరదా, వినూత్నమైనది. ఇక తొమ్మిదవ తరగతి చదువుతున్న తన్మీత్ కౌర్‌కు కొత్త కెరీర్ మార్గాలను కల్పించడానికి, నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి కోడింగ్ తోడ్పడుతుందన్న అభిప్రాయం ఉంది.

కరోనా మహమ్మారి అనంతర కాలంలో నైపుణ్యం కలిగిన కోడర్‌లకు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కు విపరీత డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)( అనగా ఛాట్ జిపిటి), తదుపరి తరం టెక్నాలజీలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. భారతీయ అమ్మాయిలు ఏ మాత్రం వెనుబడిలేరు. ఇప్పుడు ప్రపంచ స్థాయి కోడర్లుగా మారడానికి మెళకువలు నేర్చుకుంటున్నారు.

ఓ పక్క పెద్ద ఎత్తున టెకీల లేఆఫ్‌లు చోటుచేసుకుంటున్న తరుణంలో మరోపక్క డెవలపర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఫ్రంట్‌ఎండ్, బ్యాక్‌ఎండ్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్, మెయిన్‌టెన్స్ చేసే వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఓ జాబ్ పోర్టల్ తెలిపింది.

భారత దేశంలో 45000 కృత్రిమ మేధస్సు(ఏఐ) ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. డేటా సైంటిస్టులు, మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) ఇంజనీర్ల కెరీర్‌లకు కూడా బాగా డిమాండ్ ఉందని ‘టీమ్ లీజ్ డిజిటల్’ అనే టెక్ స్టాఫింగ్ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News