Monday, December 23, 2024

రికార్డు స్థాయికి దేశీయ బంగారం ధరలు!

- Advertisement -
- Advertisement -

ముంబై: నేడు మార్కెట్‌లో ‘ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్’ రికార్డు స్థాయికి పెరిగాయి. విదేశీ మార్కెట్‌లో లాభాలు, డాలరు సూచీ బలహీనతల ఆధారంగా బంగారం ఫ్యూచర్స్ ధరలు పెరిగిపోయాయి. అయితే ప్రపంచంలో బంగారంకు డిమాండ్ తగ్గిందన్నది గమనార్హం. స్థానిక బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ. 56245కు పెరిగింది. ఇది 2020 ఆగస్టులో పెరిగిన రికార్డు స్థాయి రూ. 56191ని అధిగమించింది. మదుపరులు పెట్టుబడికి బంగారంను ఎంచుకుంటున్నారన్న సూచన ప్రస్ఫుటమైంది. నవంబర్ మొదలు నుంచే బంగారం ధరలు పెరగడం మొదలయింది. ద్రవ్యోల్బణం నిదానించడం కారణంగా అమెరికా ఫెడ్ కూడా వడ్డీరేట్లను పెంచడంలో నెమ్మది చూపుతోంది. అందువల్ల బంగారం ధరలు ఊపందుకున్నాయని తెలుస్తోంది. హెడ్జ్ ఫండ్స్‌ను కూడా బలంగా కొనడం మొదలయింది. సెంటిమెంట్ ఉచ్ఛస్థాయిలో ఉండేలా మనీ మేనేజర్లు కూడా చూస్తున్నారు. దేశంలో పెళ్లిల సీజన్ ముందున్నందున బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News