- Advertisement -
న్యూఢిల్లీ : మణిపూర్ పరిస్థితిపై కలుగుచేసుకుంటామని అమెరికా రాయబారి చెప్పడంపై భారతదేశం స్పందించింది. సాధారణంగా ఇతర దేశాల వ్యవహారాలలో వేరే దేశం దౌత్యవేత్తలు మాట్లాడటం అనుచితం అవుతుందని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ విషయం అమెరికా రాయబారికి కూడా తెలిసే ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారిక సంస్థలు పాటుపడుతున్నాయని చెప్పారు. అమెరికా రాయబారి ఆ విధంగా మాట్లాడినట్లు తనకు నేరుగాతెలియదని, అయితే అటువంటి వ్యాఖ్యలకు దిగినట్లు నిర్థారణ అయితే దీనిపై తగు విధంగా స్పందిస్తామని బాగ్చీ చెప్పారు. పూర్తిస్థాయి నిర్థారణ లేకుండా వీటిపై మాట్లాడటం కుదరదన్నారు.
- Advertisement -