- Advertisement -
కొలంబో: అనూహ్య ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆర్థిక పరిస్థితిని, మరో విడత ఆర్థిక సహాయాన్ని అందచేయాల్సిన అవసరాన్ని అంచనా వేసేందుకు ముఖ్య అర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ సారథ్యంలో ఒక భారతీయ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం(జూన్ 23) శ్రీలంక రాజధాని కొలంబోను సందర్శించనున్నది. మూడు గంటల పాటు ఇక్కడ గడపనున్న ఈ ప్రతినిధి బృందం శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని విక్రమసింఘెతో సమావేశమై చర్చలు జరపనున్నది. ఈ నెల 20 న్యూఢిల్లీలోని శ్రీలంక రాయబారి మిలింద మొరగొడ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చలకు స్పందనగా భారత ప్రతినిధి బృందం కొలంబోను సందర్శించనున్నట్లు డైలీ మిర్రర్ పత్రిక బుధవారం పేర్కొంది.
Indian Govt Delegation to visit Sri Lanka
- Advertisement -