Monday, December 23, 2024

శ్రీలంకకు భారత్ సాయం చేస్తుంది: జైశంకర్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: శ్రీలంకలో రాజకీయ, ఆర్థి సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం పొరుగు దేశానికి సాయం చేసేందుకుప్రయత్నిస్తోందని, శ్రీలంకకు తగు సహాయం చేస్తామని ఆయన చెప్పారు. ‘మేము శ్రీలంకకు మద్దతుగా ఉన్నాం. వారికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. వాళ్లు వారి సమస్యలతో సతమతమవుతున్నారు. ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి శరణార్థుల సంక్షోభం లేదు’ అని జైశంకర్ అన్నారు. కేరళలో ఆదివారం పర్యటించిన సందర్భంగా ఆయన శ్రీలంక సంక్షోభంపై స్పందించారు. పొరుగు దేశానికి తాము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Indian Govt help to Sri Lanka: Minister Jai Shankar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News