Wednesday, December 25, 2024

ప్రజ్ఞానంద సంచలనం

- Advertisement -
- Advertisement -

మరోసారి కార్ల్‌సన్‌పై విజయం
చెస్సబుల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్

Indian Grandmaster R Pragyanand won on master Carlson

 

న్యూఢిల్లీ: చెస్సబుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద మరోసారి సంచలన విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్ఞానంద జయకేతనం ఎగుర వేశాడు. మూడు నెలల వ్యవధిలో కార్ల్‌సన్‌ను ఓడించడం ప్రజ్ఞానందకు ఇది రెండోసారి కావడం విశేషం. హోరాహోరీగా సాగిన ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్నాడు. అగ్రశ్రేణి కార్ల్‌సన్‌ను మట్టికరిపిస్తూ చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్‌కు మరింత చేరువయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News