న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ పాలనా పగ్గాలను తాలిబన్లు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా భారత ఉన్నతాధికార బృందం అఫ్గానిస్థాన్ పర్యటనకు బయలు దేరింది. సీనియర్ దౌత్యవేత్త నేతృత్వంలో ఈ బృందం అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించే మానవతా సాయాన్ని పరిశీలిస్తుంది. భారత విదేశీ వ్యవహారాలకు చెందిన జెపి సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. తాలిబన్ లో అక్కడి ప్రభుత్వ సీనియర్ సభ్యులను వీరు కలుసుకుంటారు. అఫ్గాన్ ప్రజలకు భారత్ అందించే సాయంపై చర్చిస్తారు. అఫ్గాన్ ప్రజలకు సహాయాలను అందించే అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఈ సభ్యులు కలుసుకుంటారని ప్రకటన వెలువడింది. ఇంతేకాక , భారత్ ప్రభుత్వం ఎక్కడెక్కడ పథకాలను, ప్రాజెక్టులను చేపట్టి అమలు చేస్తున్నదో ఆయా ప్రాంతాలను ఈ బృందం పరిశీలిస్తుంది. ఇప్పటివరకు భారత్ 20,000 టన్నుల గోధుమలు, 13 టన్నుల ఔషధాలు, 5,00,000 కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అఫ్గాన్‌కు అందించింది. ఇవన్నీ కాబూల్ లోని ఇందిరాగాంధీ చిల్డ్రన్ ఆస్పత్రికి, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలకు అందించారు. ఇంకా వైద్యసహాయన్నా, ఆహార ధాన్యాలను అఫ్గాన్‌కు అందించాలన్న లక్షంతో భారత్ ఉంటోంది.
అఫ్గాన్‌లో భారత్ ఉన్నతస్థాయి బృందం పర్యటన
- Advertisement -
- Advertisement -
- Advertisement -