Friday, December 20, 2024

పూర్వవైభవం దిశగా భారత హాకీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒకప్పుడూ ప్రపంచ హాకీలో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత పురుషుల జట్టు కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఓటములతో సతమతమైంది. ఒలింపిక్, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లకు అర్హత సాధించడంలో కూడా విఫలమైంది. భారత హాకీ సంఘంలో నెలకొన్న విభేదాల కారణంగా జట్టు ఆట తీరు రోజురోజుకు తీసికట్టుగా తయారైంది. అయితే ఎప్పుడైతే హాకీ అభివృద్ధికి తనవంత సహకారం అం దించేందుకు ఒడిశా ప్రభుత్వం ముందుకు వచ్చిందో అప్పటి నుంచి భారత హాకీ తీరు మొత్తం మారిపోయింది. ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ హాకీ పురోగతికి తనవంతు సహా యం అందించారు.

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌కు వహాబ్ గుడ్‌బై

ఒడిశాలో అధునాతన హాకీ స్టేడియాలను నిర్మించడమే కాకుండా అత్యుత్త మ ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రాలను కూడా నెలకొల్పారు. ఇటు పురుషుల జట్టుకు అటు మహిళల టీమ్‌కు ఒడిశా ప్రభుత్వం ప్రధా న స్పాన్సర్‌గా నిలిచింది. క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పలు ప్రోత్సహకాలు ప్రకటించడంతో భారత హాకీ మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. కొం త కాలంగా ప్రపంచ హాకీలో భారత్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోంది. ఇందుకు టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్ల ప్రదర్శనే నిదర్శనంగా చెప్పాలి. ఈ ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా, మహిళల టీమ్ కొద్దిలో ఈ ఛాన్స్‌ను కోల్పోయింది. దేశంలో హాకీ అభివృద్ధికి ఒడిశా ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తుండగా మరోవైపు హాకీ ఇండియా కూడా దీని కోసం పలు చర్యలు తీసుకొంటోంది. దీంతో భారత హాకీ టీమ్‌లు మళ్లీ బలోపేతంగా తయారయ్యాయి.

మెరుగైన ప్రదర్శన..

మరోవైపు అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లలో భారత మహిళా, పురుషుల జట్లు అత్యంత నిలకడైన ఆటతో అలరిస్తున్నాయి. తమకంటే మెరుగైన స్థానాల్లో ఉన్న జట్లను సయితం భారత జ ట్లు ఒడిస్తున్నాయి. యూరప్, ఆస్ట్రేలియా, దక్షి ణ అమెరికాలకు చెందిన జట్లను భారత జట్లు అలవోకగా ఓడిస్తున్నాయి. ఇది భారత హాకీకి ఎంతో ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. సీనియర్లతో పాటు జూనియర్ ఆటగాళ్ల కలయికతో హాకీ జట్లు సమతూకంగా మారాయి. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ట్రోఫీని సాధించింది. ఈ క్రమంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇక మలేసియాతో జరిగిన ఫైనల్లో ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా భారత పురుషుల జట్టు ప్రపంచ హాకీపై తనదైన ముద్ర వేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఏకంగా మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. రానున్న రోజుల్లో కూడా ఇదే జోరును కొనసాగించాలనే లక్షంతో భారత హాకీ జట్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News