Tuesday, November 5, 2024

భారత కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు. జులై 28 నుంచి బర్మింగ్‌హామ్ నగరంలో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఈ క్రీడల్లో టీమిండియాకు పూల్‌బిలో చోటు దక్కింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు కెనడా, వేల్స్, ఘనా జట్లు ఈ పూల్‌లో ఉన్నాయి. మరోవైపు ఈ క్రీడల కోసం 18 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు సారథ్యం వహించిన మన్‌ప్రీత్ సింగ్‌నే ఈసారి కూడా కెప్టెన్‌గా నియమించారు. పి.ఆర్.శ్రేజేష్, కృష్ణన్ బహాదూర్ పాఠక్‌లు గోల్ కీపర్లుగా వ్యవహరిస్తారు.
జట్టు వివరాలు:
గోల్ కీపర్లు: పి.ఆర్.శ్రీజేష్, కృష్ణన్ బహాదూర్ పాఠక్
డిఫెండర్స్: వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్
మిడ్‌ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హార్దిక్ సింగ్, వివేక్ సాగర్, షంషేర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, నిలకంఠ శర్మ
ఫార్వర్డ్: మన్‌దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్, లలిత్ కుమార్, అభిషేక్.

Indian Hockey team for Commonwealth games in England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News