Wednesday, September 18, 2024

ఆసియా ట్రోఫీకి భారత హాకీ జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి జోరుమీదున్న పురుషుల హాకీ జట్టు త్వరలో మరో మెగా టోర్నమెంట్ బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 8 నుంచి 17 వరకు చైనా వేదికగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత హాకీ జట్టును ఎంపిక చేశారు. ఈ మెగా టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జ ట్టును భారత హాకీ సమాఖ్య ప్రకటించింది. టీమ్‌లో యువ, కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సీనియర్ గోల్ కీపర్ శ్రీజేశ్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరాను గోల్ కీపర్‌లుగా ఎంపిక చేశారు.

కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన 10 మంది ఆటగాళ్లకు భారత జట్టులో స్థానం కల్పించారు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ జట్లు పోటీ పడనున్నాయి. భారత్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనాతో తలపడుతుంది. సెప్టెంబర్ 8న ఈ మ్యాచ్ జరుగనుంది. మరోవైపు భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వివేక్ సాగ్ ప్రసాద్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. గోల్ కీపర్స్‌గా క్రిషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా, డిఫెండర్స్‌గా జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, మిడ్ ఫీల్డర్స్‌గా రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ, వివేక్ సాగ్ ప్రసాద్, మహ్మద్ రహీల్ మోసిన్, ఫార్వర్డ్‌గా అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరైజీత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్‌లను ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News