Thursday, September 19, 2024

హాకీలో కాంస్యం

- Advertisement -
- Advertisement -

పారిస్: కోట్లాది మంది అభిమానులను ఆశలను నిలుపుతూ భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. గురువారం స్పెయిన్‌తో కాంస్య పతకం కోసం హోరాహోరీగా సాగిన పోరులో భారత్ 21 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. ఆరంభం నుంచి పోరు నువ్వేనేనా అన్నట్టు సాగింది. ఇటు భారత్, అటు స్పెయిన్ ఎటాకింగ్ గేమ్‌తో ముందుకు సాగాయి. రెండు జట్లు సర్వం ఒడ్డడంతో పోరులో ఉత్కంఠత తప్పలేదు. అయితే తీవ్రంగా పోరాడినా తొలి క్వార్టర్స్‌లో గోల్స్ సాధించడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. కానీ రెండో క్వార్టర్స్‌లో స్పెయిన్ తొలి గోల్‌ను నమోదు చేసింది. 18వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు మార్క్ మిరల్లెస్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో స్పెయిన్ 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత్ తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు భారత్ శ్రమ ఫలిచింది. తొలి అర్ధభాగం ముగుస్తుందనగాభారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి స్కోరును 11తో సమం చేశాడు. మూడో క్వార్టర్ మొదలైన కొద్ది సేపటికే హర్మన్‌ప్రీత్ భారత్‌కు రెండో గోల్‌ను అందించాడు. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి భారత్‌కు 21 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ చిరస్మరణీయ విజయంతో వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది.

అభినందనల వర్షం..
మరోవైపు కాంస్యపతకంతో మెరిసిన భారత హాకీ జట్టుపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరే ంద్ర మోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత హాకీ జట్టును అభినందించారు. భారత హాకీ జట్టు కోట్లాది మంది ప్రజ ల కలను సాకారం చేసిందని వారు కొనియాడారు. అసాధారణ ఆటతో కాంస్య పతకం సాధించి యావత్ జాతి గర్వించేలా చేశారని వారు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News