Friday, November 22, 2024

జెండా ఎగరడం అంటే

- Advertisement -
- Advertisement -

జాతీయ జెండా అందరికీ అండ
ఎగిరేటి జెండా మనందరికీ రక్షణ దండ
జాతీయ జెండా క్రిందే
ఏ జెండా అజెండా అయినా
ఇంటిపై ఎత్తిన ప్రతి జెండా
ఇంటిలోన ముచ్చటగా
మువ్వన్నెల తో గర్వంగా మెరుస్తుంది
ప్రతి భారతీయుని ఎద
సంతోషంగా మురుస్తుంది
జెండా అంటే దేశం గుండె
అని తెలుసుకుంటే
ప్రతి మదిలో దేశభక్తి ఇనుమడింప చేస్తుంది
ప్రతి వ్యక్తి కర్తవ్యం బోధపడుతుంది
జెండా ఎగరడం అంటే
దేశం గుండె కొట్టుకోవడమే!
జెండా గీతం పాడడం అంటే
దేశమాతను సేవించడమే
జెండాలు
పరస్పరం గౌరవించుకుంటాయి
అప్పుడప్పుడు తగాధపడుతాయి
గుండె బలం నింపుకుంటాయి
జాతీయ జెండాను ఎత్తడం అంటే
దేశమాతను భద్రంగా కాపాడడమే!

పి.బక్కారెడ్డి
9705315250

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News