Wednesday, January 22, 2025

ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్య్రం

- Advertisement -
- Advertisement -

కోట్ల మంది ప్రజలు ఎదురు చూసిన క్షణం…
గాంధీజీ, మరెందరో మహనీయులు
కలలు కన్న ప్రపంచం…
మన భారతదేశం…
సమరయోధుల పోరాట బలం…
అమర వీరుల త్యాగఫలం…
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం…
మన స్వాతంత్ర దినోత్సవం…
ఎందరో వీరుల త్యాగఫలం…
ఆధునిక పరిజ్ఞానం…
అందుబాటులో నూతన విద్య విధానం…
రైతుల సహకారం…
సైనికుల పోరాటం…
వైద్యుల సహాయం…

నేటి మన భారతదేశం…
మహోన్నతమైన
సూక్తులు చెప్పిన మహనీయులు…
కలంతో కాలానికి మార్గనిదర్శనం
చేసిన కవి పండితులు….
రాజ్యాలను పరిపాలించిన
రాచరికానికి ముగింపు పలికి
బ్రిటిష్ అనే దాస్య శృంఖలాలను పడగొట్టి,
ప్రజాస్వామ్యానికి ఆహ్వానం పలికిన తరుణం…
ఇదే నా పుణ్యదేశం అని చాటి
చెప్పిన తరుణం…
సర్వోన్నత పదవులను
అలంకరించిన మన మేధావులు…
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు,
సకల శాస్త్రాలు… పుట్టిన ప్రదేశం…
చంద్రయాన్ -3 తో చరిత్రను సృష్టిస్తున్న దేశం…
మన భారతదేశం…
కుల, మత, జాతి,
వర్గ భేదభావాలు లేకుండా
అందరూ కలిసి జరుపుకునే ఆనందాల హేళ…

అందరి సహకారంతో
అభివృద్ధి చెందుతున్న వేళ…
ప్రతి భారతీయుడూ
గొప్పగా చెప్పుకోదగిన రోజు…
శిరస్సుని ఎత్తుకొని
గర్వంగా నిలబడిన రోజు…
చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు…
ప్రతి భారతీయ పౌరుడికీ
77 స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు…

కె. వీరేంద్ర చారీ- 8074099810

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News