Tuesday, January 7, 2025

క్షిపణి దాడికి భారతీయుడు బలి

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయుడు బలయ్యాడు. ఉత్తర ఇజ్రాయెల్ లోని గలీలీ ప్రాంతంలోని మార్గలియోట్ అనే నగరంలో సోమవారం తోటలో పనిచేసుకుంటున్న పట్నిబిన్ మాక్స్ వెల్ అనే వ్యక్తి లెబనాన్ వైపునుంచి ప్రయోగించిన యాంటీ టాంక్ క్షిపణి దాడిలో మరణించాడు. మృతుడు కేరళలోని కొల్లాం జిల్లాకు చెందినవాడని తెలిసింది. క్షిపణి దాడిలో భారతదేశానికి చెందిన మరో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. లెబనాన్ లోని హెజ్బొల్లా ఉగ్రవాదులు ఈ క్షిపణిని ప్రయోగించినట్లుగా అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News