- Advertisement -
తిరువనంతపురం: జోర్డాన్‌లో కాల్చివేతకు గురైన భారతీయుడి భౌతిక కాయాన్ని కేంద్రం ఖర్చులు భరించి తెప్పించాలని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వి.డి.సతీశన్ గురువారం విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. తిరువనంతపురంకు సమీపంలోని తుంబకు చెందిన అనీ థామస్ గాబ్రియెల్ భౌతిక కాయాన్ని తెప్పించడంలో జోర్డాన్‌లోని ఇండియన్ ఎంబసీకి ప్రభుత్వం ఆదేశాలు పంపాలని సతీశన్ కోరారు. గాబ్రియెల్ చెల్లుబాటయ్యే పర్యాటక వీసాపై , మూడు నెలలు అక్కడ ఉండేందుకు పర్మిట్ కూడా పొందాడని ఆయన భార్య సతీశన్‌కు తెలిపినట్లు సమాచారం. గాబ్రియెల్ కుటుంబానికి అతడి మరణ వార్త ఈమెయిల్ మార్చి 1న అందిందని సమాచారం.
- Advertisement -